![]() |
![]() |

కోపంలో కొన్నిసార్లు ఏం మాట్లాడుతారో ఎవరికీ అర్థం కాదు. అలాంటి మాటే అన్నారు ఈ మధ్య సైఫ్ అలీఖాన్. తన ఇంట్లోకి చొరబడి ఫొటోలు తీస్తున్నవారితో `ఓ పని చేయండి. మా బెడ్‌రూమ్‌లోకి వచ్చేయండి` అని అన్నారు. ఆ మాటలు తెగ వైరల్ అయ్యాయి. దాని గురించి రీసెంట్‌గా వివరణ ఇచ్చారు సైఫ్ అలీఖాన్.
"ప్రతిరోజూ మమ్మల్ని బయట ఫొటోలు తీస్తూనే ఉంటారు. మేం కూడా సహకరిస్తూనే ఉంటాం. కానీ గేట్ తోసుకుని, సెక్యూరిటీని దాటుకుని ఇంట్లోకి వచ్చి ఫొటోలు తీశారు. అది చూడగానే చాలా కోపం వచ్చింది. అందుకే అలాంటి మాట అన్నాను. వాళ్లను ఆపలేకపోయారని నేనేం సెక్యూరిటీ గార్డును తీసేయలేదు. నేను తీసేశానని వస్తున్న వార్తల్లోనూ నిజం లేదు. లోపలికి వచ్చిన ఫొటోగ్రాఫర్ల మీద కేసులు కూడా పెట్టలేదు. ఎందుకంటే ఇష్యూని మనం డీల్ చేయాల్సిన విధానం అది కాదు. ప్రతి వ్యక్తికీ ప్రైవసీ ఉంటుంది. దాన్ని అవతలివారు గౌరవించాలి. ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉండాలి. అలా కాకుండా హద్దులు దాటినప్పుడు నాకే కాదు, ఎవరికైనా బాధ కలుగుతుంది.
మా పిల్లలు ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కి వెళ్లినప్పుడు కూడా వాళ్లను రకరకాలుగా ఫొటోలు తీస్తుంటారు. అలా చేయడం ఎందుకు? పిల్లల రక్షణ మీద మాకెప్పుడూ ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. దాన్ని ఎందుకు అర్థం చేసుకోరనే విషయం నేనూ, కరీనా చాలా సార్లు మాట్లాడుకుంటుంటాం. దయచేసి మా ప్రైవసీ మాకు ఇవ్వండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి" అని అన్నారు సైఫ్.
ఇటీవల తన ఇంట్లో కూర్చుని ఉండగా, ఎదురు బిల్డింగ్ నుంచి తనపై ఎవరో ఫోకస్ చేస్తున్నారనే విషయం గమనించారు ఆలియా. వెంటనే పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. ఇలాంటివి చాలా సార్లు ఫేస్ చేశానని జాన్వీ కూడా ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. నాలుగు గోడల మధ్య పర్మిషన్ లేకుండా ఇలా చేయడం భావ్యం కాదని సెలబ్రిటీ లోకం గట్టిగా చెప్పింది. దీని గురించే లేటెస్ట్ గా సైఫ్ మాట్లాడారు.
![]() |
![]() |